బిగ్ బాస్ షో అంటే గొడవలు కొట్లాటలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి సీజన్ లోనూ గొడలవు జరగటం కామన్. అసలు ప్రేక్షలు షో చూసేదే వాళ్ల గొడవలు..రొమాన్స్ కోసం. అయితే బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం అయిన రెండో రోజే హౌస్ లో గొడవలు జరగటం ఆశ్చర్యకరం. నామినేషన్ సమయంలో ఇంటి సభ్యులు జెస్సీ, హమిదా మరియు విశ్వలు గొడవ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగానే ఈరోజు వచ్చిన ప్రోమో మరింత రచ్చరచ్చగా ఉంది. ఏకంగా ముఖం పగిలిపోతుందంటూ ఇంటి సభ్యులు వార్నింగ్ లు ఇచ్చుకున్నారు. ఈ సారి బిగ్ బాస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో అందరినీ నవ్వించే కంటెస్టెంట్ లోబో. అతడి వేషం తోనూ మరియు అతడి చేస్టలతోనూ లోబో అందరినీ నవ్విస్తున్నాడు.