నిన్నటి ఎపిసోడ్ లో లోబో తో పాటూ ఇద్దరు లేడీ కంటెస్టెంట్ లు హమీదా, సెవెన్ ఆర్ట్స్ సరయు లు దమ్ముకొట్టారు. దానికి సంబంధించిన వీడియోను బిగ్ బాస్ టెలికాస్ట్ చేశాడు. దాంతో సరయు, హమీదాలను నెటిజన్లు ఆడుకుంటున్నారు. సరయు అంటే ఎలాగూ సెవెన్ ఆర్ట్స్ లో మాస్ మహారాణి అనిపించుకునింది. కాబట్టి లైట్ తీసుకుంటున్నారు కానీ హమీదా చూడ్డానికి ఇన్నోసెంట్ గా కనిపించి దమ్ముకొడుతుండటంతో ట్రోల్స్ చేస్తున్నారు. దమ్ము కొట్టడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని సలహా ఇస్తున్నారు. ఇక దమ్ము కొట్టే మగాళ్లు మాకు సరయు..హమీదా లాంటి పెళ్లామే కావాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.