బిగ్ బాస్ సీజన్-5 కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. హౌస్ లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ తో పాటు గొడవలు కొట్లాటలు కూడా ఫుల్ గా జరుగుతున్నాయి. ఇక ఈ సారి బిగ్ బాస్ సీజన్-5 లోకి టీవీ నటీనటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా సెలబ్రెటీలు, సినిమా నటీనటులు ఎంట్రీ ఇచ్చారు. వారిలో అర్జున్ రెడ్డి సినిమా నటి లహరి కూడా ఉన్నారు. లహరి అర్జున్ రెడ్డి సినిమాలో నర్సు పాత్రలో కనిపించి అలరించారు. పాత్ర నిడివి తక్కువగా ఉన్నా లహరిని చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన లహరి కూడా లేడీ అర్జున్ రెడ్డిలాగే ప్రవర్తిస్తున్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దానికి కారణం లహరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి చిర్రు బుర్రలాడుతూనే ఉన్నారు. ప్రతి విషయానికి లహరి ఫైర్ అవుతుండటంతోనే ప్రేక్షకులు లహరికి లేడీ అర్జున్ రెడ్డి అంటూ నామకరణం చేశారు.