బిగ్ బాస్ అంటేనే గొడవలు కొట్లాటలు, లవ్ ట్రాక్ లు ఈ ఫార్ములాతోనే బిగ్ బాస్ సీజన్లన్నీ సూపర్ హిట్ అవుతుంటాయి. ఇక ప్రతీ సీజన్ లోనూ లవ్ ట్రాక్ లు కామన్.. అది హిందీ అయినా తెలుగు బిగ్ బాస్ అయినా లవ్ ట్రాక్ లు లేకపోతే ఆ షో చూసేందుకు ప్రేక్షకులు కూడా ఇష్టపడరు. అంతే కాకుండా ముఖ్యంగా బిగ్ బాస్ టీనేజర్లు ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే. ఇక ఇప్పటికే బిగ్ బాస్ సీజన్5 ప్రారంభం కాగా గొడవలు ఏడుపులు నవ్వులు మొదలయ్యాయి. దాంతో రొమాన్స్ ను ఇష్టపడే ప్రేక్షకులు లవ్ ట్రాక్ లు ఎప్పుడు మొదలవుతాయా అని ఎదురుచూస్తున్నారు. కాగా వారి ఆశలు కూడా త్వరలోనే నెరవేరబోతున్నట్టు కనిపిస్తోంది. లవ్ ట్రాక్ లు మొదలు పెట్టేందుకే హౌస్ మేట్స్ కూడా ప్లాన్ లు వేస్తున్నట్టు కనిపిస్తోంది.