బిగ్ బాస్ లో మిగతా ఇంటి సభ్యులకంటూ కండలు ఉన్నవారికి కాస్త లాభాలు ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే బిగ్ బాస్ లో బుద్ధితో చేసే టాస్క్ లతో పాటు బలంతో చేసే టాస్క్ లు కూడా ఎక్కువే. ముఖ్యంగా ఫిజికల్ టాస్క్ లు ఇచ్చినప్పుడు ధృడంగా ఉన్నవాళ్లకే టీం సభ్యులు కూడా అవకాశం ఇస్తుంటారు. దాంతో ప్రతి సీజన్ లో కూడా హౌస్ లోకి ఓ కండల వీరుడు ఎంట్రీ ఇస్తుంటాడు. బిగ్ బాస్ మూడో సీజన్ లో అలీ రెజా తన సిక్స్ ప్యాక్ బాడీతో యాంగ్రీ మేనెజ్మెంట్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక అలాగే బిగ్ బాస్-4 సీజన్ లో మెహబూబ్ దిల్ సే తన ఫిట్నెస్ తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతే కాకుండా మెహబూబ్ తో టాస్క్ లో తలపడాలంటే హౌస్ మేట్స్ కూడా బయపడేవారు.