బిగ్ బాస్ సీజన్ 5 నుండి మొదటి వారంలో 7 ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ అయ్యిన సంగతి తెలిసిందే. సరయు ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చిన తరవాత నాగార్జున ముందు సంచలన వ్యాఖ్యాలు చేశారు. హౌస్ మేట్స్ పై సరయు చేసిన కామెంట్స్ తో నాగార్జున కూడా షాక్ అయ్యారు. ఇక బిగ్ బాస్ నుండి వచ్చిన తరవాత వెంటనే బిగ్ బాస్ బజ్ కు ప్రతి ఇంటి సభ్యుడు ఇంటర్య్వూ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సరయు కూడా బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఈ ఇంటర్వ్వూకు హోస్ట్ గా గత సీజన్ లో బిగ్ బాస్ బోల్డ్ పాపగా గుర్తింపు తెచ్చుకున్న అరియానా వ్యవహరిస్తుంది. ఇక ఈ ఇంటర్వ్యూలో అరియానాతో సరయు ఏం చెప్పింది ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేసిందో ఇప్పుడు చూద్దాం. హౌస్ లో చాలామంది స్ట్రాటజీలతో వచ్చారని సరయు వ్యాఖ్యానించింది.