బిగ్ బాస్ సీజన్ 5 మొదలవ్వగా ఫస్ట్ వీక్ లోనే ఓ రేంజ్ లో గొడవలు కుమ్ములాటలు మొదలయ్యాయి. ఇక గత సీజన్ లలో ఇంటి సభ్యులు వెళుతుంటే ఎంతో ఎమోషన్ కనిపించేది కానీ ఈ సీజన్ లో ఎక్కువగా వారి మధ్య ఉన్న గొడలవే ఫోకస్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 5 నుండి మొదట ఎలిమినేట్ అయిన సరయు బోల్డ్ పాప అరియానా గోరీకి బిగ్ బాస్ బజ్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్వూలో సరయు సంచలన వ్యాఖ్యలు చేసింది. హౌజ్ లో పలురువు సభ్యులకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయంటూ సరయు కామెంట్లు చేసింది. ముఖ్యంగా లోబోను అసలు మనిషిలా చూడరని...రోబో అందరి వాడని తన గేమ్ తాను అడుకుంటున్నాడని తెలిపింది. అతడిని ఓ పనోడిలా బంటులా చూస్తున్నారని అన్నీ బరిస్తున్నాడని సరయు వెల్లడించింది.