బిగ్ బాస్ తెలుగులోకి ప్రతి సీజన్ లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎంట్రీ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రియా అనే నటి ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రియా వయసు కాస్త ఎక్కువే అయినప్పటికీ చూడ్డానికి మాత్రం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారందరికంటే కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటుంది. కుర్రాళ్లు కూడా ముందు నుండి ప్రియా ఆంటీకే జై అంటున్నారు. ఇక నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సరయు బిగ్ బాస్ స్టేజ్ దద్దరిల్లేలాగా మాట్లాడడమే కాకుండా బిగ్ బాస్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో హౌస్ మేట్స్ పై సంచలన ఆరోపణలు చేసింది. హౌస్ లో ఎవరెవరు ఎలాంటి వాళ్లు....ఏం మాట్లాడుకుంటున్నారు. వాళ్ల స్టాటర్జీలు ఎలా ఉన్నాయి. ఇలా ఒక్కోటి చొప్పున అన్నీ బూతుల పాప భయటపెట్టింది.