బిగ్ బాస్ సీజన్ 5 లో సభ్యులంతా డిఫరెంట్ గానే ఉన్నారు. యాంగ్రీ మేనేజమ్మెంట్ తో వస్తే ఫ్యాన్స్ అవుతారని అనుకున్నారో ఏమోగానీ ప్రతీ ఒక్కరూ బీపీ పేషంట్ లా కొప్పడిపోతున్నారు. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా హౌస్ లో దాదాపు అందరి పరిస్థితి అదే విధంగా ఉంది. గత సీజన్ లో బిగ్ బాస్ హౌస్ అంతా రొమాంటిక్ గా లవ్ ట్రాక్ లు కనిపించగా బిగ్ బాస్ సీజన్ 5 లో కొట్లాటలు గొడవలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ రెడ్డి నటి లహరి వ్యవహారం చూస్తే అర్జున్ రెడ్డిలాగే అనిపిస్తుంది. గట్టి గట్టిగా అరుస్తూ హౌస్ దద్దరిల్లేలా చేస్తుంది. మరో వైపు ఉమా, శ్వేత వర్మ ల పరిస్థితి కూడా అలానే ఉంది.