బిగ్ బాస్ లోకి మొదటి వారం ఎలిమినేట్ అయ్యిన సరయు కూడా మళ్లీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి బిగ్ బాస్ లో ప్రస్తుతం ఉన్నవాళ్లలో సరయు టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ అని అంతా అనుకుంటున్నారు. సరయు కూడా తాను మొదటి వారమే ఎలిమినేట్ అవ్వడంపై షాక్ కు గురైంది. మరోవైపు తాను లవ్ ట్రాక్ లు నడపలేనని కావాలనే బిగ్ బాస్ పంపిచాడు అన్న భావనలో కూడా ఉంది. అంతే కాకుండా తనను కాలలనే సిరి అండ్ బ్యాచ్ కావాలని బయటకు పంపించారని సరయు ఆరోపిస్తోంది. మరో వైపు సరయు అభిమానులు కూడా సరయు బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.