ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 5 కి సంబంధిచిన లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా రేపు షణ్ముక్ పుట్టిన రోజు ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే బిగ్ బాస్ షణ్ముక్ బర్త్ డే ను గట్టిగానే ప్లాన్ చేశాడు. ఏకంగా షణ్మక్ ప్రేయసి దీప్తి సునైనా ను లైవ్ లోకి తీసుకువచ్చి షణ్ముక్ కు ప్రపోజ్ చేయించాడు. షణ్ణు ఐ లవ్ యూ అని చెప్పగానే బిగ్ బాస్ హౌస్ అంతా రొమాంటిక్ గా మారిపోయింది. మరోవైపు ఇప్పటికే దీప్తి షణ్ముక్ జంట ప్రేమించుకుంటున్నారు అంటూ వార్తలు రాగా తాజాగా బిగ్ బాస్ ప్రోమోతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక బహిరంగంగానే ప్రపోజ్ లు చేసుకుంటున్న ఈ జంట పెళ్లి చేసకుని కలకాలం కలిసి ఉంటుందా చూడాలి.