బిగ్ బాస్ సీజన్-5 లో ప్రేమకథలు మొదలైనట్టే కనిపిస్తుంది. ఇటీవల సరయు బిగ్ బాస్ నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టే ఎవరు ఎవరిని పడేయాలా అన్న ప్లాన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక సీజన్ మొదలయ్యి వారం కావస్తున్నా బిగ్ బాస్ లో రొమాన్స్ మొదలవ్వడం లేదా అని అనుకుంటున్న వాళ్ల కోసం 5 ఎక్స్ రొమాన్స్ మొదలయ్యేలా ఉంది. గత బిగ్ బాస్ సీజన్-4 రొమాంటిక్ సీజన్ గానే ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ సీజన్-4 లో ముఖ్యంగా మోనాల్ గజ్జర్ అఖిల్ సార్థక్, అభిజిత్ ల ట్రయాంగిల్ స్టోరీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 లో కూడా అలాంటి ట్రయాంగింల్ లవ్ స్టోరీనే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.