బిగ్ బాస్ లో ఎప్పుడు ఎవరి క్రేజ్ పెరుగుతుందో ఎవరి క్రేజ్ తగ్గుతుందో చెప్పడం చాలా కష్టం. ఈ రోజు ఒకరికి క్రేజ్ ఉంటే మరుసటి రోజు అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుందా అంటే చెప్పలేం. దానికి కారణం మనం అనుకున్న విధంగా కంటెస్టెంట్స్ ఈ రోజు కనిపిస్తే రేపు అలా ఉండకపోవచ్చు. అయితే కొంత మందికి బయట ముందే ఎంతో క్రేజ్ ఉంటుంది. వారు హౌస్ లోకి వచ్చాక వారికి ఉన్న అభిమానులు మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్ లకు అభిమానులు అవుతున్నారు. ఇక ఇప్పటికే కొంతమందికి ముందే ఫ్యాన్ బేస్ ఉండగా మరికొందరికి కొత్తగా ఏర్పడుతున్నారు. తాజాగా హౌస్ లో జరిగిన పరిస్థితులను బట్టి షన్ముక్ షన్ను మరియు వీజే సన్నీలకు అభిమానులు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.