బిగ్ బాస్ సీజన్-5 అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగు పెట్టింది. మూడో వారంలో సోమవారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగినట్టు కనిపిస్తోంది. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదల కాగా ఇంటి సభ్యులంతా ఫైర్ మీద ఉన్నారు. అయితే ఈ సారి బిగ్ బాస్ తాము నామినేట్ చేయాలనుకునే కంటెస్టెంట్ పేరును పలక పై రాసి బద్దలు కొట్టే విధంగా ఏర్పాటు చేశాడు. దాంతో ఒక్కో కంటెస్టెంట్ వచ్చి బద్దలు కొడుతూ నామినేట్ చేస్తున్న వారి గురించి తమ అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇక నామినేషన్ టైమ్ వచ్చిందంటే ఇంటి సభ్యులు ఏ రేంజ్ లో రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకూ క్లోజ్ గా మాట్లాడుకున్న వాళ్లు కూడా నామినేషన్ టైం వచ్చిన తరవాత గొడవలకు రెడీ అవుతారు.