బిగ్ బాస్ లో అన్ని రోజులూ ఒకలా ఉంటే నామినేషన్ రోజు మాత్రం మరోలా ఉంటుంది. అప్పటి వరకూ కలిసి ఉన్న సభ్యులు ఒకరిపై ఒకరు బాంబులు పేలుస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక మూడో వారం నామినేషన్ లో భాగంగా హౌస్ లో రచ్చ మొదలైంది. ముఖ్యంగా నటి ప్రియా కంటెస్టెంట్ రవి మరియు లహరి పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నామినేషన్ లో భాగంగా మీరు నాతో సరిగ్గా మాట్లాడటం లేదని...చాలా డిస్టెన్స్ మెయిన్టెయిన్ చేస్తున్నారని ప్రియాతో చెప్పి లహరి నామినేట్ చేసింది. దాంతో ప్రియా నువ్వు ఇంట్లో ఉన్న మగవాళ్లందరితో చాలా బిజీగా ఉంటున్నావంటూ సంచలన ఆరోపణలు చేసింది. దాంతో నేను ఇంట్లో ఎవరెవరితో బిజీగా ఉన్నాను..మిగితా వాళ్లతో కూడా మాట్లాడుతున్నానని యానీ మాస్టర్ తో మాట్లాడుతున్నా అని అందరితో మాట్లాడుతున్నా అని చెప్పింది.