బిగ్ బాస్ హౌస్ లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నా కూడా ఒక్కరోజు జరిగిన గొడవలు మాట్లాడిన మాటలు సభ్యులపై ఎంతో ప్రభావాన్ని చూపించవచ్చు. చిన్న చిన్న విషయాలే ఎలిమినేషన్ కు దారి తీయవచ్చు. బిగ్ బాస్ లో అన్ని కెమెరాలు ఫోకస్ పెడతాయి కాబట్టి ఏం మాట్లాడాలన్నా కూడా ఆచి తూచి మాట్లాడాలి. తేడా వస్తే ఎలిమినేషన్ తప్పదు. ముఖ్యంగా గత సీజన్లు చూసినట్టయితే నోటిని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే అంత మంచింది. ఇక తాజాగా బిగ్ బాస్-5 లో నోరు జారిన ప్రియాకు కూడా బయట నెగిటివిటి మొదలైంది. ప్రియా ఇటీవల యాంకర్ రవికి మరియు లహరికి మధ్య ఎఫైర్ ఉన్నట్టు షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. యాంకర్ రవి లహరి బాత్రూంలో అద్ధరాత్రి హగ్ చేసుకున్నారంటూ ప్రియా కామెంట్లు చేయడంతో రచ్చరచ్చగా మారింది.