తెలుగు బిగ్ బాస్-8 సీజన్ త్వరలోనే ముగియబోతోంది ఇందులో కంటెస్టెంట్ గా మంచి గుర్తింపు సంపాదించిన వారిలో సోనియా ఆకుల కూడా ఒకరు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ డైరెక్టర్ వర్మతో తెరకెక్కించిన కొన్ని చిత్రాలలో నటించడంతో ఈమె మరింత గుర్తింపు అందుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వెళ్లడానికి వర్మ హస్తము ఉందని గతంలో రూమర్స్ వినిపించాయి. అయితే హౌస్ లో బాగానే చేరువైనప్పటికీ.. నిఖిల్, పృథ్వీ విషయంలో ఏమి ప్రవర్తన చాలామందికి నచ్చకపోవడంతో హౌస్ లోకి ఎంటర్ ఇచ్చిన నాలుగో వారంలోనే బయటికి వచ్చేసింది.


అయితే హౌస్ నుంచి బయటికి వచ్చాక సోనియా పేరు తెగ వైరల్ గా మారింది.. పలు రకాల ఇంటర్వ్యూలలో ఈమె పలు విషయాలను తెలియజేసింది. ఇదంతా పక్కన పెడితే సోనియా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. తన ప్రియుడు యష్ పాల్ వీరగోనీ ని వివాహం చేసుకోబోతోంది.. ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో నవంబర్ 21న వీరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగినది తాజాగా పెళ్లి డేట్ ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం డిసెంబర్ 21 మధ్యాహ్నం 3:40 నిమిషాలకు వీరి వివాహం జరగబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని సైతం విడుదల చేసింది సోనియా.


దీంతో అభిమానులు ముందుగానే ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోనియా తనకు కాబోయే శ్రీవారిని సైతం బిగ్ బాస్ హోస్ట్ అయిన నాగార్జునను కలిసి తమ పెళ్ళికి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.. నాగార్జున కూడా వీరి పెళ్లికి వస్తానంటూ మాట ఇచ్చారట.. అందుకు  సంబంధించిన వీడియో ని కూడా సోనియా కాబోయే భర్త యష్ తన ఇంస్టాగ్రామ్ వీడియోలో తెలియజేశారు.. మా జీవితంలో ఏదైనా స్పెషల్ డే అయినటువంటి మా వివాహానికి తప్పకుండా రావాలని నాగార్జున గారిని ఆహ్వానించామంటూ ఈ వీడియోలో తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: