ఎంఐ 10టీ ప్రో ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కభాగంలోనే అందించారు. ఎంఐ 10టీ ప్రో లో కూడా రెండు వేరియంట్స్ ఉన్నాయి. కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్, అరోరా బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పైనే ఈ ఫోన్ కూడా పని చేయనుంది.