యాడ్ లు లేకుండా యుట్యూబ్ ను అందిస్తున్న నెట్ వర్క్ ..ఎయిర్ టెల్ ప్రస్తుతం ఒక ప్రమోషనల్ ఆఫర్ అందిస్తోంది. దీని కింద యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ను మూడు నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. ఈ కొత్త ఆఫర్ ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా పొందవచ్చు. అయితే ఇది ప్రస్తుతం కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం, యూట్యూబ్ రెడ్, గూగుల్ ప్లే మ్యూజిక్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోని వారికి దీన్ని ఎయిర్ టెల్ ఉచితంగా అందిస్తోంది..