ఒప్పో ఎఫ్17, ఒప్పో ఏ15, ఒప్పో ఏ12, ఒప్పో రెనో 3 ప్రో ఫోన్లపై ఈ ధర తగ్గింపు లభించింది. ఈ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లపై రూ.500 నుంచి రూ.2,000 వరకు ధర తగ్గింపును అందించనుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండిట్లో ధర తగ్గింపును అందించారు. రెనో 3 ప్రో స్మార్ట్ ఫోన్‌పై అత్యధికంగా రూ.2,000 తగ్గింపును అందించగా, ఒప్పో ఏ15 స్మార్ట్ ఫోన్‌పై రూ.500 తగ్గింపును అందించారు. ఈ నాలుగు ఫోన్లు నాలుగు వెరియంట్లలో ఉన్నాయి.