వైరల్ అస్సాంలోని ట్రైబల్స్ ఏరియాలో పండుతున్న బోకాసాల్ బియ్యం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ బియ్యాన్ని వండకుండానే వాటికి సరిపడా నీళ్లు పోసి 30 నిమిషాలు పక్కన పెట్టేస్తే చాలు అన్నం రెడీ అవుతోంది. ఈ వరి వంగడాలను మనకు పరిచయం చేసిన రైతు కరీంనగర్ జిల్లా శ్రీరాముల పాలెం కు చెందిన శ్రీకాంత్.శ్రీకాంత్ కు ప్రకృతి వ్యవసాయం పై ఉన్న మక్కువ కారణంగా ఈ వరి వంగడాలను పండించడానికి కారణమయ్యింది.