శాంసంగ్ గెలాక్సీ నుంచి త్వరలోనే మరో ఫోన్ విడుదల కానుంది..గెలాక్సీ ఏ32 5జీ అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ సపోర్ట్ పేజీ గత వారమే లైవ్‌లోకి వచ్చేసింది. దీన్ని బట్టి ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అవుతుందని తెలుస్తుంది.ఫోన్ కు సంబందించిన ఫోటోలు ఆన్ లైన్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఫొటోల ప్రకారం బ్లాక్, బ్లూ, వైట్, పర్పుల్ రంగుల్లో లాంచ్ కానుంది.