రహస్యంగా ఏదైనా చూడాలనుకున్నా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరపాలనుకున్నా ఇన్ కాగ్నిటో విండో ఓపెన్ చేసుకోవడం చాలామందికి అలవాటు. మొబైల్ ఫోన్ లో కూడా ఈ ఫెసిటిలీ అందుబాటులో ఉండటంతో అందరూ దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇన్ కాగ్నిటోలో ఏదైనా వెబ్ సైట్ గురించి సెర్చ్ చేసినా, ఓపెన్ చేసినా.. హిస్టరీలో అది కనిపించదు. అయితే అది కూడా నిజం కాదని అంటున్నారు టెక్ నిపుణులు. ఇన్ కాగ్నిటో విండోలో ఓపెన్ చేసిన సమాచారం కూడా సర్వర్లకు ఈజీగా అందుతుందట.