మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి వస్తున్న ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ కంపెనీ విడుదల చేసిన ఫోన్లు అన్నీ మార్కెట్ మంచి డిమాండ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ ఇప్పుడు మరో కొత్త ఫోన్ ను లాంఛ్ చేసింది.స్మార్ట్ఫోన్ ఎ55 5జీని చైనాలో విడుదల చేసింది. ఒప్పో ఏ55 5జీ 6జీబీ ర్యామ్ తో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో ఫోన్ బిగ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వెనకవైపు మూడు కెమెరాల సెటప్ కూడా ఉంది.