గెలాక్సీ ఎంఓ2 ను భారత్‌లో ఫిబ్రవరి రెండో తేదీన విడుదల చేయనున్నది. వచ్చే మంగళవారం నాడు మధ్యాహ్నం ఒంటిగంటకు విపణిలో అడుగు పెట్టనున్నది గెలాక్సీ ఎంవో2. లైవ్ స్ట్రీమ్‌లో దీన్ని లాంచ్ చేయనున్నారు. గతేడాది జూన్‌లో శ్యామ్‌సంగ్ ఆవిష్కరించిన గెలాక్సీ ఎంఓ1కు కొనసాగింపుగా ఎం సిరీస్‌లో భాగంగా వినియోగదారులకు చౌక ధరలో ఈ ఎంవో2 ఫోన్ వస్తోంది. దీని ధర రూ.7000 లోపు ఉంటుందని భావిస్తున్నారు.శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎంవో1 ఫోన్ ధర రూ.8,999 కాగా, సింగిల్ 3జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. గతేడాది డిసెంబర్లో శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎంవో1 ఫోన్ ధరను రూ.7,499కి నిర్దారించారు.