లెవల్ యూ2 నెక్‌బ్యాండ్ వైర్లెస్ హెడ్ఫోన్లను శామ్సంగ్ భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త హెడ్ఫోన్లు సింగిల్ ఛార్జీతో 500గంటల స్టాండ్‌బై టైమ్ ను అందిస్తాయి. శామ్సంగ్ 12ఎంఎం ఆడియో డ్రైవర్లతో పాటు వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపిఎక్స్ 2-రేటెడ్ బిల్డ్‌ను కూడా అందించింది. సరైన సౌండ్ అవుట్‌పుట్ కోసం శామ్సంగ్ స్కేలబుల్ కోడెక్ టెక్నాలజీని కూడా లభిస్తుంది.దీనిలో 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అందించడం విశేషం. ఇది బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో పాటు రెండు మైక్రోఫోన్లతో వస్తుంది. ఇంకా ఏఏసీ, ఎస్బీసీ, స్కేలబుల్ కోడెక్‌లకు సపోర్ట్ చేస్తుంది. వీటి ధర రూ. 1,999గా కంపెనీ ప్రకటించింది.