రెడ్ మీ కే40 లాంచ్‌ను షియోమీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ ఫిబ్రవరి 25వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫిబ్రవరిలో లాంచ్ కానుందని గతంలో షియోమీ టీజ్ చేసింది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది.కే40 ఫిబ్రవరి 25వ తేదీన లాంచ్ కానుందని చెప్పడం తప్ప, ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి ఎటువంటి వివరాలు తెలపలేదు. రెడ్ మీ కే40 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కూడా కంపెనీ రూపొందిస్తుందని, అతి త్వరలోనే ఆ ఫోన్ కూడా మార్కెట్ లోకి త్వరలోనే రానుంది.