వివో కంపెనీ నుంచి మార్కెట్ లోకి ఇప్పటి వరకు వచ్చిన అన్ని మొబైల్ ఫోన్లు యువతను బాగా ఆకట్టుకున్నాయి.వాటి స్మార్ట్ ఫీచర్స్ అన్నీ విధాలుగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపయోగ పడతాయి. వివో ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో యువతకు ఇంకాస్త దగ్గరవడం కోసం ఒకేసారి రెండు ఫోన్లను విడుదల చేయనుంది. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. వివో తన ఎక్స్50 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌నను ఎక్స్60 సిరీస్‌తో పాటు మనదేశంలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.