డీజిల్ ట్రాక్టర్ తో పోలిస్తే CNG ట్రాక్టర్ ధర కూడా తక్కువ. ఎక్కువ కాలం మన్నిక వస్తుంది.దీనికి దాదాపు 70 శాతం వరకు పొగ తక్కువ విడుదలచేస్తుంది. అంతేకాకుండా రైతులకు ట్రాక్టర్ పై పెట్టె ఖర్చు లో సగభాగం తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లీటర్ డీజిల్ ధర 80 -84 వరకు ఉంది. అదే కేజీ CNG ధర రూ.42 మాత్రమే. అంతేకాకుండా CNG లో కార్బన్ ఇతర కాలుష్య కారకాలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి.