ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సిద్ధమైంది. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో జరగబోతున్న ఈ తొలి ప్రయోగం ఇది. ఈ నెల 28న ఉ.10.24 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పి.ఎస్.ఎల్.వి. సి-51 నింగిలోకి ఎగురుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 28న పి.ఎస్.ఎల్.వి. సి-51 రాకెట్ ద్వారా దేశంలోని ప్రైవేట్ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.