జియోనీ మ్యాక్స్ గతేడాది ఆగస్టులో లాంచ్ అయింది. దీని ధరను రూ.5,999గా నిర్ణయించారు. ఇందులో 6.1 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. 2.5డీ కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ను ఇందులో అందించారు. ఇందులో ఆక్టాకోర్ యూనిసోక్ 9863ఏ ప్రాసెసర్ ను అందించారు. 2 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. 32 జీబీ స్టోరేజ్ ను అందించారు. ఇక ఇప్పుడు లాంఛ్ కానున్న ఫోన్ కెమెరాను చూస్తే..ధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, మరో డెప్త్ సెన్సార్ ను కూడా ఇందులో అందించారు. ఇక ముందువైపు 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ బరువు 185 గ్రాములు ఉంటుందని అంటున్నారు.