డ్రైవింగ్ లైసెన్స్ లు పునరుద్ధరణ తో పాటు డూప్లికేట్ లైసెన్స్ తో పాటు అడ్రస్ మార్పు (RC) కోసం ప్రజలు పదేపదే ఆర్ టీ ఓ ఆఫీస్ కు రావాల్సిన పనిలేకుండా రవాణా శాఖ ప్రయత్నిస్తోంది. ఇంటి దగ్గర నుంచి ఆయా వ్యక్తుల పత్రాలు అప్లోడ్ చేసి, పరీక్షలు ఇవ్వడానికి మాత్రమే ఆర్ టీ వో కార్యాలయానికి రావాలనే విధంగా ఏర్పాటు చేస్తోందట. కొత్త స్మార్ట్ వ్యవస్థ ప్రకారం, స్లాట్ బుక్ అయిన వెంటనే సదరు అభ్యర్థులు లెర్నింగ్ లైసెన్స్ కోసం డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. జమ అయిన వెంటనే మీకున్న వెసలుబాటు సౌలభ్యం ప్రకారం పరీక్ష తేదీ ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది.