శాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్ ఫోన్ మనదేశంలో మార్చి 5వ తేదీన లాంచ్ చేయనుంది. ఇప్పుడు లాంచ్కు ముందు ఈ స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో లీకైంది. ప్రముఖ టిప్ స్టర్ ఇషాన్ అగర్వాల్ తెలుపుతున్న దాని ప్రకారం గెలాక్సీ ఏ32 4జీ ధర 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉండనుంది.గెలాక్సీ ఏ32 మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. ఈ సంవత్సరం గెలాక్సీ ఏ12 తర్వాత ఆ సిరీస్లో వచ్చే ఫోన్ ఇదే. ఇటీవలే ఈ ఫోన్ వేరే దేశంలో లాంచ్ అయింది. నాలుగు కలర్ ఆప్షన్లు కూడా ఇందులో ఉండనున్నాయి.