ఒప్పో ఎఫ్19, ఒప్పో ఎఫ్19 ప్రో, ఒప్పో ఎఫ్19 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు మార్చి 8వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ రెండర్లు, స్పెసిఫికేషన్లు ఆన్ లైన్లో లీకయ్యాయి. ప్రముఖ టిప్ స్టర్ ఇషాన్ అగర్వాల్ ఈ వివరాలను లీక్ చేశారు. వీటి ప్రకారం ఇందులో అమోఎల్ఈడీ డిస్ ప్లే, వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. ఆన్ లైన్ లో లీక్ అయిన వివరాల ను ఒకసారి పరిశీలిస్తే.. ఇందులో 6.43 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. ముందువైపు హోల్ పంచ్ కటౌట్లో 16 సెల్ఫీ కెమెరా ఉండనుంది. మీడియాటెక్ హీలియో పీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ను అందిస్తున్నారు.