రెడ్ మి మొబైల్స్ ప్రత్యేకతలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తక్కువ కాలం లో బాగా ఫేమస్ అయ్యాయి. పండగ సీజన్లలో మరీ ఎక్కువ సేల్స్ ను అందుకున్నాయి. కాగా ఇప్పుడు కొత్తగా రెడ్ మి 10 సిరీస్ మొబైల్స్ సందడి చేస్తున్నాయి.. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను పరిచయం చేసింది షావోమీ. ఈ మూడు స్మార్ట్ఫోన్లు రెడ్మీ నోట్ 9, రెడ్మీ నోట్ 9 ప్రో, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్‌కు అప్‌గ్రేడ్ వర్షన్స్. రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో సూపర్ అమొలెడ్ డిస్ప్లేను పరిచయం చేసింది షావోమీ. 5000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.