జాతీయ రహదారికి ఒక ఎల్లో కలర్ బాక్స్ ను ఏర్పాటు చేసి ఉంటారు.వాటిని SOS కాల్ సెంటర్స్ అంటారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దీనిని ఏర్పాటు చేసింది. ఈ బాక్స్ తో కూడిన ఫోన్ ప్రతి 200 మీటర్ల మేరకు ఒకటి ఉంటుంది.మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు,మీరు వందకు కాల్ చేయలేని సమయంలో ఈ బాక్స్ మీద ఒక గ్రీన్ బటన్ ఉంటుంది. దానిని లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలా చేయటం వలన అందులో ఏర్పాటు చేసిన సిస్టం ఆటోమేటిక్ గా 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కు కనెక్ట్ చేయబడుతుంది. అప్పుడు మీరు వచ్చిన ఆపద గురించి తెలియజేయవచ్చు.