మార్చి నెల కొత్త వస్తువులకు కొదవ లేదు.. మొబైల్ కంపెనీలు భారీ తగ్గింపు తో కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో వివో కంపెనీ కూడా కొత్త ఫోన్లను లాంఛ్ చేయనుంది. వివో ఎక్స్60, ఎక్స్60 ప్రో స్మార్ట్ ఫోన్లు చైనాలో గతేడాది లాంచ్ అయ్యాయి. తర్వాత జనవరిలో ఎక్స్60 ప్రో ప్లస్ కూడా అక్కడ లాంచ్ అయింది. ఇప్పుడు వివో ఈ ఎక్స్60 సిరీస్ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది.. ఇకపోతే ఈ నెలలోనే ఈ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. ఈ ఫోన్లు దాదాపు 40 వేలకు పైన ఉంటుంది.. వివో ఎక్స్ 60 ధర 39,290 ఉండగా, వివో ఎక్స్ 60 ప్రో రూ.50,510 ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ దశ 56 వేలకు పైన ఉంటుంది.