మీ ఆధార్ కార్డు పై ఉన్న అడ్రస్ నుంచి మారిపోయారా..? కొత్త అడ్రస్ అప్డేట్ చేయడానికి కొత్త అడ్రస్ పై ఎలాంటి ఫ్రూఫ్స్ లేవని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకునే సదుపాయాన్ని UIDAI అందుబాటులోకి తీసుకొచ్చింది. అది కూడా ఆధార్ సేవా కేంద్రం వెళ్ళకుండానే ఆన్ లైన్ లో అడ్రస్ మార్చుకునే వెసులుబాటు కల్పించింది