రియల్ మి.. ప్రముఖ మొబైల్ కంపెనీలలో ఒకటి.. ఈ కంపెనీ అగ్రగామి సంస్థగా పేరొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల కొత్త ఫోన్లను విడుదల చేసింది.ఇప్పుడు కూడా మరో కొత్త ఫోన్ ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అదే రియల్ మీ 8 సిరీస్. ఈ స్మార్ట్ ఫోన్ను మార్చి 24న విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేశారు కంపెనీ సీఈఓ మాధవ్ శేత్. అయితే ఇది ఏ ఫోన్ అనే విషయాన్ని కచ్చితమైన సమాచారాన్ని ఆయన తెలియజేయలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇది రియల్ మీ 8-సిరీసేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.