మీ మొబైల్ పోయిందా.? అయితే గూగుల్... ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కు ఫైండ్ మై డివైస్ ఫీచర్ ను అందిస్తోంది. ఈ డివైస్ ను మీరు ఉపయోగించుకోవాలంటే అందుకు తగ్గట్టుగా ముందుగానే సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఫీచర్తో మిస్ అయిన ఫోన్ ఎక్కడుందో కనిపెట్టడం కష్టం. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కు ఫైండ్ మై డివైస్ ఫీచర్ పూర్తిస్థాయిలో పనిచేయాలంటే స్మార్ట్ ఫోన్లో మొబైల్ డేటా ఆన్ చేసి ఉండాలి. లేదా వైఫై నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉండాలి. లొకేషన్ సెట్టింగ్ అంటే జిపిఎస్ ఆన్ లో ఉండాలి. మీ స్మార్ట్ ఫోన్ లో ఫైండ్ మై డివైస్ సెట్టింగ్ కూడా ఆన్ చేసి ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటే మీ స్మార్ట్ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు.