యూట్యూబర్లకు, యూట్యూబ్ ట్యాక్స్ రూపంలో షాక్ ఇవ్వనుంది. యూట్యూబ్ ఛానల్ కు అమెరికా వ్యూవర్ల ద్వారా వచ్చే ఆదాయం పై 15% వరకు టాక్స్ నిర్ణయించారు. అయితే ఈ ఏడాది నుంచి ఈ కొత్త ట్యాక్స్ ను అమలు చేయనున్నారు.. అంటే మీ ఛానెల్ కు ఒకవేళ అమెరికాలో ఉన్న వాళ్ళు ఫాలో అవుతుంటే, మీరు క్రియేట్ చేసిన కంటెంట్ వాళ్లు చూస్తుంటే, మీకు ఆదాయం వస్తుంది కదా..! ఇప్పుడు ఆ ఆదాయంపై 15 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ పన్ను కేవలం అమెరికా బయటి యూట్యూబ్ వాళ్లకు మాత్రమే..