మిగిలిపోయిన ఆహార వ్యర్థాలతో పారాఫీన్ అనే ఇంధనాన్ని తయారు చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఇంధనాన్ని విమానాలకు వినియోగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో అన్ని రకాల విమానాలు ఈ ఇంధనంతో గాల్లోకి ఎగురుతాయి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫ్యాటీ యాసిడ్ తో కూడా జెట్ ఇంధనాన్ని తయారు చేయవచ్చనే విషయాన్ని అమెరికా జాతీయ పునరుత్పాదక శక్తి పరిశోధన సంస్థకు చెందిన డెరేక్ వార్డెన్ అనే ఇంజనీర్ చెబుతున్నారు. అంతేకాకుండా ఇలా ఆహార వ్యర్థాలతో తయారు చేయనున్న ఇంధనాన్ని 2023 లో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ తో కలిసి మొట్టమొదటిసారిగా జెట్ ఫ్లైట్ పై ప్రయోగించనున్నామని వార్డెన్ చెప్పుకొచ్చారు.