కార్డు ద్వారా లభించే వస్తువులలో ముఖ్యం గా కంప్యూటర్లు ,టాబ్లు,మొబైల్ ఫోన్ ల తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను డిస్కౌంట్ ధరలకే అందించే విధంగా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (APTS) ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తరహాలో 'జీ కార్డ్'పేరుతో ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ఉద్యోగుల ఐడి నెంబర్ ను నమోదు చేసి, ఈ వస్తువులను కొనుగోలు చేసే విధంగా పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నారు.