హైదరాబాద్ జగిత్యాల జిల్లా కోరుట్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్ 7 ఏళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత సొంతంగా శ్రీ వినాయక ఎలక్ట్రికల్ రివైండింగ్ వర్క్ షాప్ పెట్టుకున్నాడు. ఇతను కేవలం ఐదు వందల రూపాయలకే ఒక మినీ కూలర్ ని తయారు చేశాడు.15 కిలోల కాళీ వంట నూనె డబ్బా తీసుకుని దానికి ఒక చిన్న మోటార్ బిగించాడు.అందులో రెండున్నర లీటర్ల నీళ్లు లోపలికి బయటికి రావడానికి ప్లాస్టిక్ వాటర్ పైపులు కనెక్ట్ చేశాడు. వాటికి రెండు వైపులా ఇనుప జాలరీ బిగించి, వాటికి గడ్డిని అమర్చాడు. మోటర్ తిరగడానికి కరెంటు వైర్ కనెక్షన్ ఇచ్చి, ట్రావెలింగ్ మినీ కూలర్ తయారు చేశాడు.12 ఇంచులు పొడవు, 9 ఇంచుల వెడల్పు ఉన్న ఈ కూలర్ ఎక్కడికైనా వెంట తీసుకు వెళ్ళవచ్చు. ముఖ్యంగా ఫంక్షన్లకు ,పార్టీలకు ,హాస్పిటల్లో రోగులకు, మరియు పేద వారికి ఈ కూలర్ చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు శ్రీకాంత్.