ఇప్పుడు పింక్ వాట్సాప్ సందేశం ఒకటి వైరల్ గా మారింది. అత్యాధునిక ఫీచర్ కోసం పింక్ వాట్సాప్ ను డౌన్లోడ్ చేయాలి అని సందేశం... ఇప్పుడు ఏ వాట్సాప్ గ్రూప్ లో చూసినా ఇది దర్శనమిస్తుంది. వాట్సప్ పింక్ (whatsapp pink ) పేరుతో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది ఈ లింక్..తెలిసీ తెలియని వారు ఈ లింక్ పై క్లిక్ చేస్తున్నారు. అంతేకాకుండా మరికొందరికి షేర్ చేస్తున్నారు.పొరపాటున ఈ పింక్ వాట్సాప్ లింక్ పై క్లిక్ చేశారంటే. మీ మొబైల్ లో ని ఫోటోలు, సందేశాలు,కాంటాక్ట్ వంటి సమాచారం సర్వం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్ళిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.