కరోనా మహమ్మారి సమయంలో రూ. 60 వేల కోట్ల విలువైన ప్రీమియంలను ఒక్క డిజిటల్ మోడ్ ద్వారానే పాలసీదారుల నుంచి వసూలు చేసింది ఎల్ఐసీ. ఇదిలా ఉండగా ఎల్ఐసి ప్రస్తుతం ఎనిమిది కోట్ల పాలసీదారుల ను కలిగి ఉంది. ఇక వారందరికీ డిజిటల్ సేవలను అందించాలనే ఉద్దేశంతోనే పేటీఎం తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.. ఇకపై ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో పాలసీదారులు గా ఉన్నారో, వారు వారి ప్రీమియంలను పేటియం ద్వారా చెల్లించేందుకు వివిధ బ్యాంకుల యూపీఐ ఛానల్ లో లేదా వాలెట్లను ఉపయోగించుకోవచ్చు.