ఖాతాదారులు బ్యాంకు వెళ్ళకుండానే , తమ సేవింగ్స్ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు. తద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఆధారంగా కాంటాక్ట్ లెస్ అండ్ పేపర్ లెస్ విధానంలో బ్యాంకు ఖాతా తెరవాలని ఎస్ బీ ఐ తమ కస్టమర్లకు తెలిపింది. అయితే ఎవరైతే నూతనంగా ఎస్ బీ ఐ లో తమ ఖాతాలను తెరవాలని అనుకుంటున్నారో వారు ప్లే స్టోర్ ద్వారా యోనో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది . ఆ తరువాత న్యూ టు ఎస్ బీ ఐ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఇక అనంతరం ఇన్ స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ పై క్లిక్ చేయాలి.తరువాత ఆధార్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక ఆధార్ నమోదు పూర్తయిన తర్వాత , వ్యక్తిగత వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. ఇక అనంతరం వీడియో కాల్ షెడ్యూల్ చేసుకోవాలి. ఇక వీడియో కాల్ పూర్తయిన తర్వాత , మీ ఖాతా ప్రారంభమవుతుంది