ఇటీవల ఇండేన్ గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టదానికి ,డ్యాక్ సర్వీసులను తీసుకొచ్చింది ఇండియన్ గ్యాస్ కంపెనీ. డ్యాక్ అంటే డెలివరీ అథెంటికేషన్ కోడ్ అని అర్థం. గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన ప్రతిసారి ఈ డ్యాక్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నంబర్ వినియోగదారుల ఫోన్ కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది.. ఎవరైతే మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడానికి వస్తారో, ఆ బాయ్ కు ఈ కోడ్ చెప్పాల్సి ఉంటుంది..