హైదరాబాదులో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో, సైబరాబాద్ పోలీసులు వినూత్నంగా ఆలోచించి, కోవిడ్ సేవల కోసం ఒక వెబ్ సైట్ ను ఆవిష్కరించడం జరిగింది.సైబరాబాద్ పోలీసులు" సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) "సహకారంతో covid.scsc.in పేరుతో ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.ముఖ్యంగా అంబులెన్సులు, ఆక్సిజన్ సప్లయర్స్, హాస్పిటల్స్‌తో పాటు వాటిలోని బెడ్స్ వివరాలు, ప్లాస్మా సపోర్ట్, బ్లడ్ బ్యాంకులు, అంతిమ సంస్కారాలు చేసే సంస్థలు , ఐసోలేషన్ సెంటర్ల వివరాలు, హోమ్ క్వారంటైన్‌పై సలహాలు ఇలా ఎన్నో రకాలుగా ఈ వెబ్సైట్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ తమ జాగ్రత్తలను పాటిస్తూ, బయటికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు..