ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ సంస్థ తమ కస్టమర్ల కోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రారంభిస్తోంది.ఈ సేల్ మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో అనేక స్మార్ట్ ఫోన్లు ,ఎలక్ట్రానిక్ వస్తువుల పై భారీగా ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక అంతే కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్లు అలాగే హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు కస్టమర్లకు పది శాతం వరకు తక్షణ రాయితీని కూడా అందిస్తోంది. ఇక ముఖ్యంగా శాంసంగ్, మైక్రోమ్యాక్స్ ఫోన్ల ను 15 వేల రూపాయల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..